HomeTelugu Newsరోబో '2.ఓ' నుండి సర్‌ప్రైజ్‌.. పార్ట్‌ 4 ఇలానే ఉంటుందట!

రోబో ‘2.ఓ’ నుండి సర్‌ప్రైజ్‌.. పార్ట్‌ 4 ఇలానే ఉంటుందట!

అక్టోబర్‌2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఈరోజు ఓ చిన్న సర్‌ప్రైజ్‌ను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్ హీరో గా నటించిన చిత్రం రోబో ‘2.ఓ’. ఈ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్‌ పార్ట్‌ను శంకర్‌ విడుదల చేశారు. పార్ట్‌ 4ను ఇలా రూపొందించామంటూ శంకర్‌ పేర్కొన్నారు. వీడియోలో రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌లను యానిమెట్రానిక్స్‌ టెక్నాలజీతో రోబోలుగా ఎలా తయారుచేశారో చూపించిన సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి.

4 1

ప్రపంచవ్యాప్తంగా 24 వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోస్‌కు సంబంధించిన 1000 మంది ఆర్టిస్ట్‌లు, పది మంది కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్‌లు, 25 మంది త్రీడీ డిజైనర్లు, 500 మంది క్రాఫ్ట్‌మెన్‌లు ఈ సినిమా కోసం పనిచేశారు. సినిమా మొత్తంలో 2150 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ వాడారు. నేటివ్‌ త్రీడీ, యానిమెట్రానిక్స్‌, 1300 ప్రీవిజువలైజేషన్‌ షాట్స్‌, 1000 కాంప్లెక్స్‌ వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌, వీక్యామ్‌ టెక్నాలజీ, స్పైడర్‌ క్యామ్‌ సిస్టమ్స్‌, లైడర్‌ స్కానింగ్‌తో యానిమేషన్‌ సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ కథానాయికగా నటించారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ రికార్డులు సృష్టించింది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu