Another star kid in Mokshagna Debut Movie:
నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నందమూరి మోక్షజ్ఞ తేజ డెబ్యూ చిత్రం ఎట్టకేలకు ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవుతుంది.
ప్రశాంత్ వర్మ టీం ఈ చిత్రానికి సరైన ప్రతినాయకుడిని ఎంపిక చేయడం కోసం శ్రద్ధ వహిస్తున్నారు. ఈ పాత్ర కోసం ప్రముఖ కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ను సంప్రదించారట. ఇటీవల ధృవ్ ఈ పాత్రకు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ధృవ్ చాలా సెలెక్టివ్ గా సినిమాలను చేస్తూ, తన కెరీర్ విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు. ప్రతి ప్రాజెక్టుపై తన తండ్రి విక్రమ్ కూడా నిర్ణయం తీసుకుంటారు.
త్వరలో ప్రశాంత్ వర్మ విక్రమ్ ను కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించనున్నారని తాజా సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా రవీనా టాండన్ కుమార్తె రషా టాండన్ ఎంపికైంది. ఇటీవల రషాపై ఒక ఫోటోషూట్ కూడా నిర్వహించారు. అలాగే, ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ క్లైమాక్స్ లో అతిథి పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి సెకన్డ్ లైఫ్ విజన్స్ (SLV) సినిమాస్ నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం.
నందమూరి వంశం నుండి మరో యువ హీరో సినీరంగ ప్రవేశం చేయనున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన వివరాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.