ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వలసల పర్వం కొనసాగుతోంది… ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలోకి జంప్ చేస్తాడో తెలియని పరిస్థితి ఉంది. కరుడుగట్టిన టీడీపీ వాదులుగా ఉన్నవాళ్లు సైతం… ఇప్పుడు ఫ్యాన్ కింద సేదతీరేందుకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఫ్యాన్ గాలికి వచ్చేడం ఖాయమైపోగా… తాజాగా టీడీపీలో మరో కీలక నేత కరణం బలరాం వైసీపీలోకి చేరబోతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన… ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల వ్యవహారానికి దూరంగా ఉన్నారు.
గత ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గొట్టిపాటి టీడీపీలోకి వచ్చిననాటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కరణం. తర్వాత రెండు వర్గాల మధ్య కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి. ఈ పంచాయతీ చంద్రబాబు ముందుకు వెళ్లినా కొలిక్కి రాలేదు. అయితే, ఆయన వైసీపీలోకి వెళ్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నా సైలెంట్‌గా ఉన్నారు. చివరకు కార్యకర్తలతో చర్చించిన బలరాం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి జగన్‌ను కలిసి కుమారుడితో సహా వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు కరణం బలరాం.