![Ram Charan కార్ కలెక్షన్ లో చేరిన సరికొత్త కాస్ట్లీ కార్ ఇదే 1 Another luxury addition to Ram Charan's car collection](https://www.klapboardpost.com/wp-content/uploads/2024/10/New-Project-2024-10-23T201033.jpg)
Ram Charan car collection:
సినిమా నటుడు రామ్ చరణ్ తన లగ్జరీ కార్ల సేకరణలో మరో విలాసవంతమైన కారు చేరుస్తూ ప్రత్యేక ఎడిషన్ రోల్స్ రాయిస్ కొనుగోలు చేశారు. ఈ కారు విలువ చాలానే కోట్లలో ఉండగా, మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో రామ్ చరణ్ తన కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం వ్యక్తిగతంగా హాజరయ్యారు.
ఆర్టీవో నిబంధనల ప్రకారం, వాహన యజమానులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్వయంగా పాల్గొనాల్సి ఉంటుంది. రామ్ చరణ్ అవసరమైన పత్రాలు సంతకం చేసి.. ఫేస్, ఫింగర్ ప్రింట్ వివరాలు సమర్పించారు. లగ్జరీ కార్లపై ప్రేమను చూపించే రామ్ చరణ్ తరచుగా తన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ఇండియాలోనే రామ్ చరణ్ ఈ కొత్త మోడల్ రోల్స్ రాయిస్‌ను కొనుగోలు చేసిన కొద్దిమందిలో ఒకరుగా నిలిచారు.
రామ్ చరణ్ ఇంత విలువైన కార్లు కొన్నా, ఆయన వ్యక్తిగతంగా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి క్రమబద్ధంగా వాహన రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం అభిమానులకు ఇన్స్పిరేషన్ గా మారింది. రామ్ చరణ్ తన జీవితంలో ఎంతైనా సాదా సీదాగా, క్రమశిక్షణగా ఉంటారని ఇది మరోసారి నిరూపించింది.
వృత్తి పరంగా, రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం RC16 కోసం సిద్ధం అవుతున్నారు. బుచ్చిబాబు సన ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
Read More: Raja Saab కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?