Homeతెలుగు Newsజనసేనలోకి మరో కీలక నేత

జనసేనలోకి మరో కీలక నేత

టీటీడీ మాజీ చైర్మన్‌, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీలో చేరారు. దీంతో జనసేన గూటికి మరో కీలక నేత చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ను చదలవాడ కృష్ణమూర్తి అక్కడే కలిశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కండువా కప్పి చదలవాడ కృష్ణమూర్తిని, ఆయన అనుచరులను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ బలోతానికి కృషి చేస్తామని కృష్ణమూర్తి తెలిపారు. చదలవాడ కృష్ణమూర్తి అనుభవంతో ఇచ్చే సలహాలను పార్టీలో వినియోగించుకుంటామని పవన్‌ కళ్యాణ్ తెలిపారు. పేతపవన్‌ బాణం విసురుతున్న ఫొటోను, కృష్ణమూర్తితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. అనంతరం పవన్‌, కృష్ణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.

2 16

టీడీపీలో సీనియర్‌ నేతగా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన తిరుపతి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. పార్టీకి ఆయన చేసిన సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను చదలవాడ గానీ, జనసేన వర్గాలు గానీ ఖండించలేదు. ఈ క్రమంలోనే ఆయన గురువారం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ గత వారం జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. అటు కాంగ్రెస్‌ నుంచి, ఇటు టీడీపీనుంచి కీలక నేతలు తమ పార్టీలో చేరినందున ఎన్నికల లోపు ఇతర పార్టీల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu