Mr Bachchan Update:
డైరెక్టర్ హరీష్ శంకర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన షాక్ సినిమా తోనే. ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించిన హరీష్ శంకర్ తర్వాత కూడా మళ్ళీ రవితేజ హీరోగా మిరపకాయ సినిమాకి దర్శకత్వం వహించారు.
తర్వాత పలు సినిమాలతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ మళ్లీ ఇన్నాళ్లకు.. రవితేజ హీరోగా సినిమా చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా నటించి హిట్ అయిన రైడ్ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
హరీష్ శంకర్ కి రీమేకులు చేయడం కొత్తేమీ కాదు. తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ అయిన గబ్బర్ సింగ్ సినిమా హిందీలో దబాంగ్ సినిమాకి రీమెకే. ఆ తరువాత జిగర్తాండ సినిమాకి రీమేక్ గా గద్దలకొండ గణేష్ అనే సినిమా కూడా తీశారు. కానీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మరి ఈసారి రీమేక్ తో హరీష్ శంకర్ ఎంత వరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
సినిమా హిట్ అవుతుందో లేదో పక్కన పెడితే హరీష్ శంకర్ ఈ సినిమా కథలో బోలెడు మార్పులు చేసినట్లు అనిపిస్తోంది. నిజానికి రైడ్ చాలా సీరియస్ సినిమా. ఒక బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి ఇంటిని సోదా చేయడానికి ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ వెళ్తాడు. అక్కడ అతను ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ. సినిమాలో కమర్షియల్ పాయింట్లకి తావే లేదు.
కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రం సినిమాలో బోలెడు కమర్షియల్ ఎలిమెంట్లు జోడించినట్లు తెలుస్తోంది. అసలు పాటలు ఎక్కువగా అవసరం కూడా లేని కథ అది. కానీ హరీష్ శంకర్ ఒకదాని తర్వాత ఒకటి మాస్ పాటలు వదులుతూనే ఉన్నారు. దీంతో అసలు హరీష్ ఉద్దేశం ఏంటి, అంత సీరియస్ కథలో ఇలాంటి కమర్షియల్ పాటలు పెట్టడానికి ప్లేస్ ఎక్కడ ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.
మరి హరీష్ శంకర్ కథను మార్చినా కనీసం ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే పర్వాలేదు కానీ.. సినిమా చిన్న తేడా వచ్చినా మొత్తం బ్యాక్ ఫైర్ అవుతుంది. మరి ఈ సారి హరీష్ శంకర్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.