Bigg Boss 8 Telugu Double Elimination:
బిగ్ బాస్ తెలుగు 8కి కేవలం 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి, గ్రాండ్ ఫినాలే 15 డిసెంబరుకు షెడ్యూల్ అయ్యింది. ప్రస్తుతం, ఇంటి లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, కానీ ఈ రేసు మరింత ఆసక్తికరంగా మారింది.
అవినాష్ ఇప్పటికే ఫైనల్ స్టేజీకి చేరుకున్నాడు. మరి మిగతా కంటెస్టెంట్స్ ఇప్పుడు చివరి ఎలిమినేషన్ రౌండ్‌లో నామినేట్ అయ్యారు. తాజాగా టాస్టీ తేజా, పృథ్వి ఎలిమినేట్ అయిన తర్వాత, మరొక డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని ఊహలు గుప్పుమంటున్నాయి. ఒక డబుల్ ఎలిమినేషన్ జరిగినా, టాప్ 5 కంటెస్టెంట్స్ మిగిలే ఉండేవారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండదని కన్ఫర్మ్ అయ్యింది. కేవలం ఒక కంటెస్టెంట్ మాత్రమే ఈ వారం ఇంటి నుండి వెళ్లిపోతారు. ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన 6 మంది కంటెస్టెంట్స్:
నిఖిల్
గౌతమ్
ప్రేరణ
నబీల్ అఫ్రీది
విష్ణు ప్రియా
రోహిణి
ప్రస్తుతం, ఓటింగ్ ట్రెండ్ ప్రకారం నబీల్, ప్రేరణ, విష్ణు ప్రియ బాటమ్ 3లో ఉన్నారు. వీరికి ఎలిమినేషన్ ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక, నిఖిల్, గౌతమ్ తమ అభిమానుల మద్దతుతో బాగానే ముందుకు వెళ్తున్నారు.
ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరు బిగ్ బాస్ ఇంటి నుండి బయటపోతారు, ఎవరు ఈ పోటీలో ఇంకా కొనసాగుతారు అనేది మరికొన్ని రోజుల్లోనే తెలుస్తుంది.
ALSO READ: Indrakeeladri Saree Scam: కనిపించకుండా పోయిన వేల కొద్దీ చీరలు.. అసలు ఏమయ్యింది అంటే!