‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలయ్యి ఇప్పటికీ రెండు నెలలు అయింది. అయితే ఇప్పటివరకు
ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ రెండు నెలల్లో మాత్రం ఆయన
చాలా కథలనే విన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా..? అనే విషయం
ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వి.వి.వినాయక్
ఇలా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా ఎన్టీఆర్ మాత్రం ఓ యువ దర్శకుడుకి
వోటు వేశాడని చెబుతున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న అనిల్
రావిపూడి కల్యాణ్ రామ్ కెరీర్ లో మంచి హిట్ సినిమా ఇచ్చాడు. ఇప్పుడు అనిల్ చెప్పిన కథ
ఎన్టీఆర్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ చెప్పిన కథ ఎన్టీఆర్
ఆశించిన విధంగా విభిన్నంగా ఉండి.. ఆకట్టుకోవడంతో దానిపైనే ఈ యంగ్ టైగర్ మక్కువ
చూపుతున్నట్లు సమాచారం. గత వారం రోజుల నుండి ఈ దర్శకుడితో ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నారు.
ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ అంధుడి
పాత్రలో కనిపించనున్నారని టాక్.