అన్నదమ్ముల పోటీ!
తమిళంలో సూర్య, తన తమ్ముడు కార్తిలకు మంచి క్రేజ్ ఉంది. తమిళంతో సమానంగా వీరి చిత్రాలు
తెలుగులో కూడా విదుదల అవుతుంటాయి. ప్రస్తుతం సూర్య సింగం సిరీస్ లో భాగంగా వస్తోన్న
సింగం3 సినిమాలో నటిస్తున్నాడు. మొదటి రెండు భాగాలు హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా
ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కార్తీ ‘కాష్మోరా’ సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా
విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపధ్యంలో ఈ
రెండు చిత్రాలు ‘దీపావళి’ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అన్నదమ్ములలో ఏ ఒక్కరూ
వెనక్కి తగ్గకుండా.. రెండు చిత్రాలను చూసి ఎంజాయ్ చేయండని అభిమానులను ఉత్సాహ
పరుస్తున్నారు. మరి ఈ బరిలో ఎవరు నెగ్గుతారో చూడాలి!