బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి అప్పుడే నెల రోజులు అయిపోయింది. సరిగ్గా నెల రోజుల క్రితం జూన్ 14న ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన లోకాన్ని విడిచి 30 రోజులు పూర్తైన నేపధ్యంలో మరోసారి ఆయన్ని గుర్తు చేసుకున్నారు సన్నిహితులు, బంధువులు. ముఖ్యంగా ఆయనతో విడదీయరాని అనుబంధం ఉన్న మాజీ ప్రియసిలు సుశాంత్‌ను గుర్తు చేసుకుని కంటన్నీరు పెట్టుకున్నారు.
రియా చక్రవర్తితో పాటు మాజీ ప్రేయసి అంకిత లోఖండే కూడా సుశాంత్‌ను గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై ఓ పోస్ట్ పెట్టారు. సుశాంత్‌తో దిగిన ఫోటోలని షేర్ చేస్తూ ఆయనతో గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంది రియా చక్రవర్తి. నా గుండెకు ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ మిగిల్చి నువ్వు వెళ్లిపోయావు.. ఆ గాయం నుంచి కోలుకోడానికి చాలా సమయం పడుతుంది.. ఆ శక్తిని నువ్వు నాకు ఇవ్వు అంటూ ఎమోషనల్ అయిపోయింది రియా.
జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నువ్వే నాకు నేర్పించావు.. ఇప్పుడు ఎంత ఏడ్చినా కూడా నువ్వు మళ్లీ తిరిగి రావని నాకు తెలుసు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రియా. అంతేకాదు.. సుశీ ఇప్పుడు ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నావని నాకు తెలుసు.. చంద్రడు, నక్షత్రాలు, గెలాక్సీలు భౌతిక శాస్త్రవేత్తకి ఘన స్వాగత పలుకుతాయంటూ ఎమోషనల్ అయిపోయింది రియా. నీ మంచితనం, ఆనందంతో ప్రతి విషయాన్ని కూడా నువ్వు చాలా అందంగా అద్భుతంగా మార్చగలవు అంటూ సుశాంత్‌ను గుర్తు చేసుకుని బాధ పడింది రియా.
నువ్వు దూరమై 30 రోజులు గడుస్తున్నప్పటికీ.. జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటానంటూ తన ప్రేమను బయటపెట్టింది. నీకు శాశ్వతంగా కనెక్ట్ అయ్యాను.. నీ పై నాకున్న ప్రేమ అనంతం.. అంతకుమించి కూడా అంటూ రియా రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోవైపు మాజీ ప్రేయసి అంకిత కూడా దేవుడి బిడ్డ అంటూ ఓ దీపం వెలిగించి సంతాపం తెలిపింది. ప్రస్తుతం ఈ ఇద్దరి పోస్టులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే సుశాంత్ అభిమానులు మాత్రం ఆ పోస్ట్ తో కరగలేదు. ఆమెపై ఫైర్ అవుతున్నారు. కామెంట్స్ లిమిట్ చేయని రియా ఓపికగా పలు కామెంట్స్ డిలీట్ చేస్తోంది. కానీ ఫాన్స్ నుంచి వస్తున్న నిరసన ఆగడం లేదు. సుశాంత్ తో అసలు సంబంధం లేని వారినే ఎటాక్ చేస్తున్న ఫాన్స్ ఇక అతని గర్ల్ ఫ్రెండ్ ని వదిలిపెడతారా? కాకపోతే ఈ దాగుడుమూతలు ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు కదలాలి కనుక రియా ధైర్యం చేసేసినట్టుంది.