తొమ్మిదేళ్ల క్రితం అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. హారర్, కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందించబోతున్నారు.
ప్రస్తుతం హారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. అఁదుకే ఇప్పుడు గీతాంజలి సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకి, రాజ్ కిరణ్ దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు.
క్రిస్మస్ సందర్భంగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. కోన వెంకట్, జేవీ, ఎంవీవీ సత్యనారాయణ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
గీతాంజలి సీక్వెల్‌కు సంబంధించి త్వరలోనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. నటి అంజలికి ఇది 50వ సినిమా. ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమాలలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇదే కావడం మరో ప్రత్యేకత.