HomeTelugu TrendingAnjali: విడాకులు తీసుకున్న ఓ తెలుగు నిర్మాతతో హీరోయిన్ పెళ్లి!

Anjali: విడాకులు తీసుకున్న ఓ తెలుగు నిర్మాతతో హీరోయిన్ పెళ్లి!

Anjali getting married to telugu producer

Anjali getting married to telugu producer: తెలుగు హీరోయిన్‌ అంజలి  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో కూడా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యనే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ చేస్తుంది.

అంజలి  ఆ మధ్య బిజినెస్ మ్యాన్ ను వివాహమాడి విదేశాల్లో సెటిల్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటి నిజం కాదని కొట్టిపారేసింది. ఈక్రమంలో మరోసారి అంజలి పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె త్వరలో ఓ తెలుగు సినిమా నిర్మాతను పెళ్లి చేసుకోనుందని అంటూ ప్రచారం సాగుతోంది.

నిజానికి గతంలో క్లారిటీ ఇచ్చినప్పుడే ఓ వ్యక్తితో ఉన్న రిలేషన్ షిప్ వల్ల కెరీర్ పై దృష్టి పెట్టలేకపోయానని, ఆ సంబంధం రాంగ్ రిలేషన్ షిప్ అని అంజలి తెలిపింది. తన కెరీర్‌కి అడ్డుగా ఉన్న రిలేషన్‌షిప్ కంటే కెరీర్‌కే ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదని కూడా ఆమె అప్పట్లో పేర్కొంది.

అయితే ఇప్పుడు విడాకులు తీసుకున్న ఓ తెలుగు నిర్మాతతో అంజలి గత ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నట్టు, త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై అంజలి స్పందిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu