తెలుగమ్మాయి అంజలి తమిళ హీరో జై తో ప్రేమలో ఉందని ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దోశ ఛాలెంజ్ లో వీరిద్దరి ఫోటోలు బయటకు రావడంతో వీరు సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్ మీడియా ప్రచురించింది. ఈ విషయంపై జై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంజలి అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టమే.. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది అని పరోక్షంగా తమ ప్రేమ గురించి చెప్పాడు.
కానీ అంజలి మాత్రం ప్లేటు పిరాయించింది. ఆ వార్తల్లో నిజంలేదని తేల్చేసింది. జై దోశ వేయడం.. అది నాకు ఇవ్వడం వరకు నిజమే.. అంత మాత్రాన.. మా మధ్య రిలేషన్ ఉందని రాస్తే ఎలా..? జై నాకు జర్నీ సినిమా నుండి తెలుసు. తను నాకు మంచి స్నేహితుడు మాత్రమే.. అంతకుమించి మా మధ్య ఎలాంటి సంబద్ధం లేదని స్పష్టం చేసింది. ఇద్దరు వేర్వేరుగా వివరణలు ఇవ్వడం.. ఒకదానితో మరొకటి పొంతన లేకపోవడంతో వీరి సంగతి ఎవరికి అర్ధం కావడం లేదు!