టాలీవుడ్‌లో నువ్వు నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన నటి అనిత హసానందాని. ఆ తరువాత ‘తొట్టిగ్యాంగ్’ వంటి పలు సినిమాల్లో నటించింది. హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నారు. బుల్లితెరపై నాగిని సీరియల్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ తన అభిమానులకు తీపి కబురు చెప్పింది. ఆమె తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రోహిత్ రెడ్డితో పరిచయం, ప్రేమ, అతడు ప్రపోజ్ చేయడం, పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు గర్భం దాల్చడం వంటి అన్ని విషయాలను చూపిస్తూ ఈ వీడియో రూపొందించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అనితకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2013లో అనిత పారిశ్రామికవేత్త రోహిత్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుమారు ఏడేళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ చిన్న కుటుంబంలోకి విచ్చేయనున్న కొత్త అతిథి కోసం వీరు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.