సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం అనిల్ వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో ఎఫ్ 3 చేద్దామనుకున్న కరోనా కారణంగా అది వాయిదా పడింది. దాంతోపాటు బాలకృష్ణ కోసం ఒక కథ , లేడీ ఓరియంటెడ్ కథ ఒకటి సిద్ధం చేసుకున్నాడట ఈ దర్శకుడు. అయితే అనిల్ రావిపూడి తన లాక్‌డౌన్ సమయాన్ని వృథా చేయకుండా ఇతర దర్శకులకు ఐడియాలను షేర్ చేసుకుంటున్నాడట. వెబ్ సిరీస్ ల కోసం కథలను సిద్దం చేయడంతోపాటు స్క్రీన్ ప్లే పనులను కూడా చూసుకునే పనిలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అనీల్ రావిపూడి దర్శకుడు కాకముందు శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.