
Heroine for Chiranjeevi Anil Ravipudi movie:
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఒక పాట మిగిలి ఉండటంతో ఈ సినిమా త్వరలోనే ఫినిష్ కానుంది. అదే సమయంలో చిరు తదుపరి చిత్రం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రాబోతుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.
అనిల్ రావిపూడి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, హీరోయిన్ ఎంపిక పనులు మొదలుపెట్టాడు. తాజా టాక్ ప్రకారం, అదితి రావు హైదరి చిరంజీవికి జోడీగా కనిపించే అవకాశం ఉంది. అలాగే, ఐశ్వర్యా రాజేష్, శ్రుతి హాసన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని టాక్.
View this post on Instagram
అనిల్ రావిపూడి సినిమాలు ఎప్పుడు ఎనర్జీ, ఫన్‌తో నిండిపోతుంటాయి. ఇప్పుడు మెగాస్టార్‌తో చేయబోయే ఈ చిత్రం కూడా అదే స్టైల్‌లో ఉండనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, మొదటి భాగం స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి కాగా, రెండో భాగం పూర్తికావస్తోంది.
ఈ సినిమా షూటింగ్‌ను 90 రోజుల్లో పూర్తి చేసి, సంక్రాంతి 2026కి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉంది టీమ్. చిరంజీవి అభిమానులు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెంచేస్తున్నారు. అనిల్ రావిపూడి స్టైల్ కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో ఇది బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది.
ఈసారి సంక్రాంతి బరిలో మెగాస్టార్ దూకుతారా? లేదా ‘విశ్వంభర’ లేట్ అవుతుందా? అనేది చూడాలి!