టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించారు. ఈ సినిమా అనీల్ కెరియర్లోనే బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాతో అనీల్ రావిపూడి కెరీర్ లో మరో మెట్టు ఎక్కాడు. అందుకే సరిలేరు సినిమా తనకు ఎప్పటికి ప్రత్యేకం అంటూ గతంలోనే చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రోజు అనీల్ భార్య పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరో పాత్ర అజయ్ కృష్ణ. అందుకే తన కొడుకు పేరును కూడా అజయ్ గా పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు అనీల్. తన కొడుకుకు అజయ్ సూర్యన్ష్ అని పెట్టినట్లుగా పేర్కొన్నాడు.