స్టార్ డైరెక్టర్ శంకర్.. రజినీకాంత్ ‘2పాయింట్ 0’ తరువాత ‘ఇండియన్ 2’ సినిమాపై దృష్టి పెట్టారు. సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసినా కొన్ని కారణాల వలన సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. మధ్యలో బడ్జెట్ హెచ్చుతగ్గుల కారణంగా కూడా సినిమా ఆలస్యం అయ్యింది. అన్ని సెట్ కావడంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నది. వేగంగా షూట్ చేస్తున్నారు.
అయితే, ఈ మూవీలో విలన్ పాత్రలో మొదట అజయ్ దేవగణ్ అనుకున్నారు. దాన్ని కన్ఫర్మ్ కూడా చేశారు. కానీ, సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ వస్తుండటంతో.. అజయ్ సినిమా నుంచి తప్పుకున్నారు. 2పాయింట్ విలన్ అక్షయ్‌ను తీసుకుందామని అనుకున్నా అయన కూడా బిజీగా మారిపోయారు. అందుబాటులో లేకవడంతో అనిల్ కపూర్ ను విలన్ రోల్ కోసం తీసుకున్నారని తెలుస్తోంది. అనిల్ కపూర్ కు దర్శకుడు శంకర్ సీన్ వివరిస్తున్న ఫోటో ఒకటి బయటకు రావడంతో ఈ విషయం లీక్ అయ్యింది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్. రకుల్ ప్రీత్ కీలక పాత్ర చేస్తున్నారు.