Andhra Pradesh new liquor policy:
ఏపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మద్యం కుంభకోణాలు.. Andhra Pradesh రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసాయి. ఎన్నికల ముందు పూర్తి మద్యం నిషేధాన్ని ప్రకటించిన వైఎస్ జగన్.. ఎన్నికల తర్వాత చీప్ లిక్కర్ పరిచయం చేసి.. ఎక్సైజ్ శాఖ ద్వారా భారీగా ఆదాయం సంపాదించారు. దీనివల్ల ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. అది కూడా 2024 రాష్ట్ర ఎన్నికల్లో.. వైసీపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపింది అని చెప్పుకోవచ్చు.
ఇప్పటి ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి అమలులోకి తీసుకురానుంది. ఈ కొత్త విధానానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసమితి, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న.. ఆరు ఉత్తమ మద్యం విధానాలను పరిశీలిస్తోంది. ఈ విధానంలో భాగంగా మద్యం ధరలు, బ్రాండ్లను నిర్ణయించి.. ఆమోదించిన అన్ని బ్రాండ్లను అక్టోబర్ 1 నుండి ఆంధ్రప్రదేశ్‌లో.. అందుబాటులో ఉంచనున్నారు.
మందుబాబులకు గుడ్ న్యూస్.. చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం | Sub Committee On New Liquor Policy |hmtv https://t.co/zpZGD8FX3O#cmchandrababu #andhrapradesh #LiquorPolicy #hmtv
— hmtv News (@hmtvnewslive) September 11, 2024
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించారు. కొత్త మద్యం విధానంలో, ప్రభుత్వమే ఈ షాపులను కొనసాగించాలా లేదా అన్ని షాపులకు బిడ్డింగ్ పద్ధతిలో అనుమతులు ఇవ్వాలా.. అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ విధానం అక్టోబర్ 1 నుండి అమలులోకి రానుండగా.. అందుకు ముందు అధికారిక ప్రకటన వెలువడనుంది.
ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న చీప్ లిక్కర్ అమ్మకాలపై నియంత్రణకు.. కొత్త విధానం ఒక మంచి మార్గం అవుతుందని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ కొత్త విధానం ఆంధ్రప్రదేశ్లో మద్యం సేల్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.