ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 2137కి చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మృతిచెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 47కి చేరింది. ఒక్కరోజులో 9,284 మందికి కరోనా పరీక్షలు జరపగా 48 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఏపీలో కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 3, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు.
కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 1142 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 948 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. నిన్న ఒక్కరోజు 86 మంది డిశ్చార్జి అయ్యారు. వీరిలో గుంటూరు 27, కృష్ణా 25, కర్నూలు 13, కడప 10, తూ.గో 4, ప.గో 4, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు: కర్నూలు 591, గుంటూరు 399, కృష్ణా 349, చిత్తూరు 142, అనంతపురం 118, నెల్లూరు 111, కడప 97, ప.గో 68, విశాఖ 66, ప్రకాశం 63, తూ.గో 51, శ్రీకాకుళం 5, విజయనగరం 4 కేసులు