నాని హీరోగా.. హను ఇమ్మాన్యుయేల్, ప్రియ హీరోయిన్స్‌గా విరించివర్మ దర్శకత్వంలో రూపొందిన ‘మజ్ను’ చిత్రం సెప్టెంబర్ 23న వరల్డ్‌వైడ్‌గా ఏసియన్ ఎంటర్ప్రైజెస్ ద్వారా రిలీజ్ అవుతోంది. సూపర్‌హిట్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవల విడుదలై శ్రోతల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆడియో సక్సెస్ మీట్‌ను సెప్టెంబర్ 20న హైదరాబాద్ దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా..
విరించివర్మ మాట్లాడుతూ.. ”నా రెండో సినిమా నానితో చేయడం లక్కీగా భావిస్తున్నాను. అలాగే ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వంటి బిగ్ బ్యానర్లో నా రెండో సినిమా చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కథ విని కిరణ్‌గారు బాగా ఇంప్రెస్ అయి నాని దగ్గరకు తీసుకెళ్లి కథ చెప్పించారు. నాని కూడా చాలా ఎగ్జైట్ అయి సినిమాని వెంటనే ఓకే చేశారు. నానితో సినిమా చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది” అన్నారు.
నాని మాట్లాడుతూ.. ”నాకు ఎప్పటి నుంచో లవ్‌స్టోరీస్ చేయాలని ఉంది. ఈ సినిమా కథ విన్నాక 150 శాతం ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. నిజంగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేశామో, ఎప్పుడు ఫినిష్ అయిందో తెలియకుండా కంప్లీట్ అయింది. సినిమా చేసేటపుడు హాయిగా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఫైనల్ రిజల్ట్ చూశాక టు హండ్రెడ్ పర్సెంట్ విరించివర్మ న్యాయం చేశాడు అనిపించింది. చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యాను. ‘మజ్ను’ ఇది నా సినిమా అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సినిమా చూసి ఆడియన్స్ చాలా ఇంప్రెస్ అవుతారు. ఏ లెక్కలు వేసుకోకుండా సింపుల్‌గా తన మనసులో ఉన్న కథని అందంగా చూపించాడు. సినిమా చేసేటప్పుడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక స్మైల్ ఉంటుంది. తెలియని ఒక హానెస్ట్, సింప్లిసిటీ ఉంది. ఈ చిత్రంలో ఫస్టాఫ్‌లో నాలుగు పాటలుంటాయి. ఈమధ్య కాలంలో ఏ సినిమాలో లేవు. పాటలన్నీ కథలో భాగంగానే ఉంటాయి. గోపిసుందర్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. లవ్‌స్టోరీ కామెడీ, ఎమోషన్స్‌తో పాటు ఒక అందమైన కథ చెప్పాలనే ప్రయత్నం చేశాం. నా సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నా సినిమా చూస్తారు. ‘మజ్ను’తో అది డబుల్ అవుతుంది. కంప్లీట్‌గా కుటుంబం అంతా చూసి ఎంజాయ్ చేయగల సినిమా ఇది” అని చెప్పారు.