తెలుగులో ‘పోవే పోరా’ షోతో బాగా గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ. దాంతో పాటు మరిన్ని షోలలో కూడా అలరించి తన సత్తా చూపిస్తుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు పర్సనల్ లైఫ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. బయటికి వెళ్లడం.. అక్కడ్నుంచి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులకు మరింత దగ్గరవుతుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక హాట్ ఫోటోషూట్స్ కూడా బాగానే చేస్తుంది విష్ణు. ఈ మధ్య విష్ణు ప్రియ చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతుంది. తాజాగా ఈమె అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన విష్ణు ప్రియ అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా బయటపెట్టింది విష్ణు ప్రియ.
తన స్టోరీలో విష్ణుప్రియ ఆషికి 2 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆదిత్యరాయ్ కపూర్ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు ఈ ఫొటో కింద ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసింది విష్ణు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వెంకటేష్ తరహాలో దేవుడా ఓ మంచి దేవుడా వచ్చే జన్మలో అయినా నాకు ఇలాంటి భర్త కావాలి అంటూ పోస్ట్ పెట్టింది.. అది చూసిన నెటిజన్లు చాలా మంది తథాస్తు అంటున్నారు. ఆదిత్య రాయ్ కపూర్ లాంటి భర్త వస్తే తనకు చాలా హ్యాపీ అంటుంది. వచ్చే జన్మ వరకు ఎందుకు ఈ జన్మలోనే వస్తాడులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.