జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్‌పై యాంకర్ వర్షిణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వర్షిణి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది. మీరు హైపర్ ఆది ప్రేమలో ఉన్నారా అంటూ వర్షిణికి ఓ అభిమాని కొంటె ప్రశ్న వేశాడు. వర్షిణి కూడా తనదైన శైలిలో ఏమో అదేం లేదు అని సమాధానమిచ్చింది. సుధీర్, ఆది గురించి ఏమైనా చెప్పండి అన్న మరో అభిమాని ప్రశ్నకు మీ అందరికీ తెలుసు సుధీర్ నా కుటుంబ సభ్యుడిలాంటి వాడు.. ఆది నాకు మంచి స్నేహితుడు. అంది వర్షిణి. మీరు డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలన్న మరో అభిమాని ప్రశ్నకు నేను ఇప్పటి వరకు అన్ని రకాల స్టైల్స్ ఫాలో అయ్యాను. ఇప్పుడు ఏ స్టైల్ ఫాలో అవ్వాలో నువ్వు చెప్పు అంటూ కోపంగా సమాధానమిచ్చింది.