బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశాడు. విజయ్ డైరెక్షన్లో.. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత సుమ మళ్లీ వెండితెర రీఎంట్రీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సుమ ఫిటినెస్‌పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోంది. అంతేగాక ఇందుకోసం తను స్పెషల్ ట్రైనర్‌ని కూడా నియమించుకుంది. తాజాగా జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న తన ఓ వీడియోను సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘2వ సెట్ డంబెల్స్ ఎత్తిన తర్వాత నా చేతులు ఎంత నొప్పిగా ఉన్నాయో వర్ణించలేను.. ఆపమంటాడేమో అని నా ట్రైనర్ రాహుల్ వైపు చూస్తూ ఉంటా.. కానీ అతను మాత్రం ఆ మాట చెప్పడు’ అంటూ సుమ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram