టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్లను తనదైన శైలిలో అలరిస్తుంది యాంకర్ సుమ. బుల్లితెర ప్రేక్షకులు ఆమెను తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావిస్తుంటారు. ఆమె మైక్ అందుకుందంటే ఆ పంచ్‌లు ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ‘తను స్టేజ్ ఎక్కేంత వరకే.. వన్స్ స్టెప్ ఇన్..’ ఆ తర్వాత చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సుమ తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకుంది.
‘నా ఉదయాలు ఇలాగే ఉంటాయి. మేకప్ లేకుండా నా శరీరం శ్వాస తీసుకుంటోంది. ధన్యవాదాలు వివేక వర్థిని కాలేజ్, వాసు యాడ్స్’ -ఇన్‌స్టాలో సుమ
‘గుడ్‌మార్నింగ్. నిన్న క్యాష్ షూటింగ్ అయింది. క్యాష్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ షోలో వివేక వర్థిని కాలేజ్ వాళ్లు ఈ పెయింటింగ్ ఇచ్చారు. నిజంగా చాలా అందంగా ఉంది. కాలేజ్ విద్యార్థులు, వాసు యాడ్స్ వారికి థ్యాంక్స్. ఇందుకోసమైనా మనం మేకప్ వేసుకుని కష్టపడి పనిచేయాలనిపిస్తుంది. సత్తి, రమేష్ పదండి. యుద్ధానికి వెళ్దాం’ అని ఇన్‌స్టా వీడియోలో పేర్కొన్నారు.