HomeTelugu Trendingవిడాకులపై తొలిసారి స్పందించిన సుమ

విడాకులపై తొలిసారి స్పందించిన సుమ

Suma Kanakala

యాంకర్ సుమ ప్రస్తుతం జయమ్మ పంచాయితీ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు .ఈ క్రమంలోనే ఆలీతో సరదాగా షోకి గెస్టుగా వచ్చిన సుమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల మీద స్పందించారు. ఆలీ అడిగిన ప్రశ్నకు సుమ ఏ మాత్రం ఆలోచించకుండా సమాధానం ఇచ్చారు. కరోనా సమయంలో మీ మీద రూమర్లు వచ్చాయి.. మీ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారనే గాసిప్స్ వచ్చాయని ఆలీ అడిగేశారు.

ఇద్దరి మధ్యలో గొడవలు అనేది వాస్తవమే.. ఈ 23 ఏళ్లలో ఎన్ని గొడవలో.. కానీ ఒకటి మాత్రం నిజం.. భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం సులభమే కానీ.. తల్లిదండ్రులుగా మాత్రం చాాలా కష్టమని సుమ చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రోమోను మాత్రం కాస్త కాంట్రవర్సీగా కట్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే సుమ చెప్పిన పూర్తి మ్యాటర్ ఏంటో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu