HomeTelugu Trendingప్రేమలో పడిన శ్రీముఖి!

ప్రేమలో పడిన శ్రీముఖి!

1
తెలుగలో యాంకర్‌ శ్రీముఖికి యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. పటాస్‌ షో ఈ బ్యూటీ ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. మొదట్లో కొన్ని సినిమాలు నటించినప్పటికీ శ్రీముఖికి పేరు తెచ్చి పెట్టింది పటాస్‌ షో. బిగ్‌బాస్‌-3లో రన్నరప్‌గా నిలిచింది ఈ భామ. బిగ్‌బాస్‌ తరువాత శ్రీముఖి క్రేజ్‌ మరింత పెరిగింది. కాగా శ్రీముఖిపై తాజాగా ఓ ఆస్తకర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీముఖి ప్రేమలో పడిందని, తనకు నచ్చిన వాడితో డేటింగ్‌ కూడా చేస్తున్నదని సమాచారం. గతంలో శ్రీముఖి ఇచ్చిన ఓ ఇంటర్వూలో, తను ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చింది. తాను ప్రేమించే వ్యక్తి తన తల్లిదండ్రుల నుంచి సమ్మతి పొందిన తర్వాతే ముందుకు వెళ్తాను అని శ్రీముఖి చెప్పినట్లు టాలీవుడ్‌ టాక్‌. అయితే.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరూ? మిగతా వివరాలు ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu