టాలీవుడ్ హాట్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘ఫిబ్రవరి 14-2-2022 ఈ రోజు.. ఈ రోజు గుర్తు పెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్’ అంటూ లవ్ ఎమోజీలతో ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇక ఫోటోలో శ్రీముఖి ఓ ఫ్లవర్ బొకే పట్టుకొని ఉంది. దీంతో ఈ యాంకరమ్మ ప్రేమలో పడిపోయిందంటూ వార్తలు వైరల్ అవుతుంది. బాయ్‌ఫ్రెండ్‌ని కూడా రివీల్ చెయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.