బిగ్‌బాస్-3 కార్యక్రమ నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్-3కి తనను ఎంపిక చేసి అగ్రిమెంట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారంటూ శ్వేతారెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ కార్యక్రమ బాధ్యులు తనను మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్‌బాస్ ద్వారా ఉత్తరాది సంస్కృతిని తెలుగువారిపై రుద్దుతున్నారని ఆమె ఆరోపించారు. బిగ్‌బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందంటూ శ్వేతారెడ్డి ఆరోపిస్తున్నారు. బిగ్‌బాస్-3 ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయిన తనను బిగ్‌బాస్‌ను ఎలా కన్విన్స్ చేస్తారని.. బాస్‌ని కన్విన్స్ చేస్తేనే షోలోకి ఎంట్రీ ఇస్తామన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ‘బిగ్‌బాస్’ సీజన్ 3 ఈనెల 21 నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం. ఈసారి అగ్ర కథానాయకుడు నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్వేతారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు.
మూడో సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్ బాస్ షోపై వివాదం ముసురుకుంటోంది. బిగ్‌బాస్‌పై యాంకర్ శ్వేతారెడ్డి ఆరోపణల తర్వాత ఇప్పుడు అదే కోవలో వర్ధమాన నటి గాయత్రి గుప్తా సైతం ఆరోపణలు చేస్తున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొనేందుకు, వెళ్లిన తనకు ఆ షో నిర్వాహకుల నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఛానెల్లో నిర్వహించిన ప్రత్యేక చర్చలో వెల్లడించారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు తనను 100 రోజుల పాటు సెక్స్ కు దూరంగా ఎలా ఉంటావని అడిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు.