రష్మి గౌతమ్ బుల్లితెరపై యాంకర్‌గా వ్యవహరిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా సందడి చేస్తుంది. తాజాగా ఆమె నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా గోవాలో తన మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా మొదలు కానుంది. ఈ సినిమాలో కాజల్ నటిస్తోంది. సినిమాను శ్రీవేంకటేశ్వర ఎల్ఎల్పీ, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రష్మి గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’లో తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆ పరిచయంతోనే ఆమెకు అవకాశం లభించిందనే టాక్.