బుల్లి తెరపై జబర్దస్త్‌లో అందాచందాలతో కుర్రకారు మతులు పోగొడుతు హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. ఇటు యాంకరింగ్ తో పాటు అటు సినిమాల్లోనూ నటిస్తోంది. ఐతే జబర్దస్త్‌లో హిట్టయినంతగా వెండి తెరపై ఆకట్టుకోలేకపోతోంది రష్మీ. అయితే ఈమె దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించినా క్రేజ్ మాత్రం పెద్దగా రాలేదు. 2002లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఇప్పటి వరకు హిట్ పడలేదు. గుంటూర్ టాకీస్, నెక్ట్స్ నువ్వే తప్ప .. చెప్పుకో తగిన లేవు. ఈ బ్యూటీ సినిమాల్లో అందాల ఆరబోత చేసినా ఆ చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఈ క్రమంలో వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది ఈ హాట్ యాంకర్.
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్లో వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ 5, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వెబ్ సిరీస్‌లు దుమ్ము రేపుతున్నాయి. దాంతో పెద్ద పెద్ద స్టార్స్ సైతం సినిమాలు చేస్తూనే వాటిలో నటిస్తున్నారు. కియారా అద్వానీ, రాధికా ఆప్టే, భూమి పడ్నేకర్, నేహా దూపియా, మనీషా కోయిరాలా సహా పలువురు తారలు లస్ట్ స్టోరీస్‌లో నటించారు. బెడ్ రూమ్ సీన్లు, సెమీ న్యూడ్ సీన్లతో ఆ వెబ్ సిరీస్‌లు సంచలనం సృష్టించాయి.
అయితే ఇప్పుడు వారి బాటలోనే ఓ వెబ్ సిరీస్‌కు రష్మీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్మీ ఏకంగా లెస్బియన్ పాత్రలో నటించబోతుందని సమాచారం. అందులో బాత్రూం సీన్స్, బెడ్ రూమ్ సీన్స్ కూడా ఉన్నాయని.. వాటిలో నటించేందుకు సిద్ధమని రష్మీ చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు సినిమాల్లో హాట్ హాట్ సన్నివేశాల్లో నటించింది రష్మీ. గుంటూరు టాకీస్, శివ రంజని వంటి చిత్రాల్లో అందాలు ఆరబోసి రెచ్చిపోయింది. సెన్సార్ ఉండే వెండి తెరపైనే అందగా రెచ్చిపోయినా అమ్మడు.. ఇప్పుడు ఎలాంటి సెన్సార్ ఉండని వెబ్ సిరీస్‌లో మరెంత రెచ్చిపోతుందోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే రష్మీ లెస్బియన్ పాత్రలో నటించబోతుందన్న వార్తలు మాత్రం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి.