HomeTelugu Trendingఅత్యాచారం ఆరోపణలపై యాంకర్ ప్రదీప్ స్పందన

అత్యాచారం ఆరోపణలపై యాంకర్ ప్రదీప్ స్పందన

Anchor pradeep clarifies onహైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మిర్యాలగూడ కు చెందిన ఓ యువతి పెట్టిన కేసు సంచలనంగా మారింది. ఓ యువతి తనపై 139 మంది లైంగికదాడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనపై అత్యాచారం చేశారని తనే స్వయంగా కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసుపై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులో యువతి ఇచ్చిన ఫిర్యాదుతో 113 పేజీలతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు పంజాగుట్టు పోలీసులు. ఈ లిస్టులో యాంకర్ ప్రదీప్ మాచిరాజు పేరు ఉండటం సంచలనంగా మారింది. ప్రదీప్ పై గత రెండు మూడు రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.

దీనిపై ప్రదీప్ స్పందించాడు. సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురిచేయడంపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు యూట్యూబ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసాడు. “నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా ఎలా రాస్తారని ప్రశ్నించాడు. వాళ్లు అనుకున్నదే నిజమని రాస్తూ, నా ఫొటోలు వాడుతూ, నా పేరు పెడుతూ కథనాలు రాస్తున్నారు.. ఎంతో సున్నితమైన అంశంలో నా పేరు ఎందుకు ఉందో అని కూడా ఆలోచించకుండా దారుణమైన రీతిలో రాసేస్తున్నారు.” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని చానళ్లు, కొన్ని యూట్యూబ్ చానళ్లు చేస్తున్నదానికి నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? అంటూ ప్రదీప్ ప్రశ్నించారు. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. వచ్చే వరకు పోరాడతాను అని ప్రదీప్ అన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu