బుల్లితెరపై వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ. ఒకానొక దశలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వ్యాఖ్యాత స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అయింది. ఆమె చేతిలో ఇప్పుడు సినిమా ఆఫర్లు చాలానే ఉన్నాయి. అంతేకాదు త్వరలో స్వయంగా సినిమాల్ని నిర్మించనున్నట్లు తెలిపారట. ఈ సంగతి తెలిసిన ప్రేక్షకులు ఒక యాంకర్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వద్ద నిర్మాతగా మారి కోట్ల వ్యయంతో సినిమాలు నిర్మించేంత డబ్బు ఉందా.. అంటే యాంకర్ల రెమ్యునరేష్ భారీ స్థాయిలోనే ఉంటుందన్నమాట అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.