కామెడీ షో జబర్దస్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో యాంకర్ అనసూయకు కూడామంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు జబర్దస్త్ షో నుంచి అనసూయ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అనసూయ పరోక్షంగా కామెంట్స్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
“నా కెరీర్లో నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చాలా మెమోరీస్ని తీసుకెళ్తున్నాను. అందులో ఎన్నో మధురక్షణాలతో పాటు.. కొన్ని చేదు క్షణాలు.. కూడా ఉన్నాయి. మున్ముందు కూడా ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను” అని అనసూయ రాసుకొచ్చింది. జబర్దస్త్ నుంచి విడిచి వెళ్ళుతుండడంతో అనసూయ ఈ కామెంట్స్ పోస్ట్ చేసిందని అంటున్నారు.