‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ భరద్వాజ్ తన అందాలతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గుర్తింపు తెచ్చుకుంది. అయితే అనసూయ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా పరియితం కాకుండా.. వీలున్నప్పడల్లా సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది ఈ బ్యూటీ. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారామంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ.
ఆ సినిమాలో రంగమ్మత్త పాత్రతో ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. అది అలా ఉంటే లాక్ డౌన్ కారణంగా ఆమె ఇంట్లో ఖాళీగా వుంటోంది. దీంతో తాజాగా తన సోషల్ మీడియాలో అభిమానులతో ఛాటింగ్ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అందులో భాగంగా ఓ నెటిజన్.. తరుణ్ భాస్కర్‌తో కలిసి మద్యం సేవించి ఓ పార్టీలో రచ్చ చేశారట కదా? అని ప్రశ్నించాడు. అందుకు అనసూయ.. ఈ ‘అట’ అనే పదాలు మీరు సరదాకి అనుకుంటే బాగుంటుందేమోనని సమాధానమిచ్చింది. అయితే నిజాలు వేరే ఉంటాయని, పరిణతి చెందితే నీకు కూడా అర్థమవుతుందని ఆ నెటిజన్ పై ఫైర్ అయింది.. అనసూయ, తరుణ్ భాస్కర్ కలిసి విజయ్ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక మరో నెటిజన్ తన చేతిపై ఉన్న టాటూకి అర్థం ఏమిటి? అడగగా.. అనుసూయ సమాధానం చెబుతూ, ‘బ్యూటీ సోల్ డీప్’ అని తెలిపింది. ఇంకా పలు ప్రశ్నలకు సమాదానం చెబుతూ.. అనసూయ పేరు తన నానమ్మ పేరని, అందుకే పేరెంట్స్ తనకు ఆ పేరు పెట్టారని తెలిపింది. ఇంకా అనసూయ సమాదానాలిస్తూ.. తమ స్వస్థలం నల్గొండ, తన ఇంటిపేరు కస్బా అని చెప్పుకొచ్చింది ఈ హాట్ యాంకర్