హాట్ యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు షాకిచ్చారు. పెద్దమొత్తంలో టాక్స్ కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. సర్వీస్ టాక్స్ కింద పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి అనసూయ పన్ను ఎగవేసినట్లుగా అధికారులు చెప్తున్నారు ఇందుకు సంబంధించి మూడు రోజుల పాటు ప్రముఖ నటులు నిర్మాతలు డైరెక్టర్లు స్టీల్ వ్యాపారులు ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు ఇందులో యాంకర్ అనసూయ తో పాటు లావణ్య త్రిపాటి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు నటి లావణ్య త్రిపాటి పన్ను ఎగవేసిన గుర్తించి నోటీసులు జారీ చేశారు అదే మాదిరిగా యాంకర్ అనసూయ కూడా పెద్దఎత్తున కొట్టినట్టుగా అధికారుల విచారణలో బయట పడింది.
55 లక్షల జీఎస్టీ కట్టమని అనసూయకి జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గత రెండు మూడు రోజులుగా పలువురు సెలబ్రిటీల ఇళ్లపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో యాంకర్లు అనసూయ, సుమల పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ వార్తలపై అనసూయ ఘాటుగా స్పందించింది. ఆదివారం తన ఆస్తులపై ఎలాంటి దాడులు జరగలేదంటూ క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. మరిప్పుడు ఏమంటుందో ఈ బ్యూటీ.