తెలుగులో యాంకరింగ్ రంగంలో దూసుకుపోతుంది అనసూయ. ఇటు బుల్లితెర, అటు వెండితెర… అని తేడా లేకుండా రెండు రంగాల్లో విజయవంతంగా రాణిస్తూ, బిజీబిజీగా గడిపేస్తోంది. తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆమెకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాక్కర్లేదు. ఇప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ ఇప్పడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే సినిమాలో కాదు, సీరియల్ అని తెలుస్తోంది.
హిందీ సీరియల్స్‌కు దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో కూడా హిందీ సీరియల్స్ ను విపరీతంగా చూస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హిందీలో ఓ టాప్ రేటెడ్ సీరియల్ లో ఓ కీలక పాత్ర కోసం అనసూయను మేకర్స్ సంప్రదించారట. ఇదే నిజమైతే.. అనసూయ రేంజ్ మరింత పెరిగిపోతుంది అనడంలో సందేహాం లేదు.