HomeTelugu Trending'రంగమార్తాండ' అనసూయ ఫస్ట్‌లుక్‌

‘రంగమార్తాండ’ అనసూయ ఫస్ట్‌లుక్‌

4 15

కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. రంగమార్తాండ టీమ్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో జబర్ధస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తోంది. ఈ సందర్భంగా అనసూయకు సంబంధించిన ఓ స్టిల్‌ను డైరెక్టర్ కృష్ణవంశీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫొటోలో ట్రెడిషనల్‌ లుక్‌లో అనసూయ అదిరిపోయింది. నీలం రంగు చీరలో… మెడలో నగలు, జడలో పూలతో అనసూయ చాలా సంప్రదాయంగా కనిపిస్తోంది. అయితే కృష్ణ వంశీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ అనసూయ కూడా స్పందించింది. ‘కృష్ణ వంశీ సినిమాలు తనకెంతో ఆదర్శమని… ఆయన మూవీల్లో ఆడవారిని ఎంతో సహజంగా, మృదుస్వభావులుగా, బలంగా చూపిస్తారంది. ఆయన సెట్స్‌లో పనిచేయడం ఓ కల అని’ అనసూయ ట్వీట్ చేసింది.

అయితే ఈ సినిమాలో మరో ముఖ్యమైన రోల్ కోసం సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందంను తీసుకుంది చిత్రబ‌ృందం. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర కేవలం హాస్యానికి పరిమితం కాకుండా.. చాలా ఎమోషన్ ఉండి, గుండెని మెలిపెట్టే భావోద్వేగాలు అందులో ఉంటాయని తెలుపుతున్నారు దర్శకుడు కృష్ణవంశీ. రంగమార్తాండ సినిమా మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా వస్తోంది. మరాఠీ సినిమాలో నానాపటేకర్‌ కీలకపాత్రలో నటించాడు. మాస్ట్రో ఇళయరాజా రంగమార్తాండకు సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu