ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఇంట విషాదం చోటుచేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు(63) ఆదివారం ఉదయం హైదరాబాద్లోని తార్నాకలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు.
సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పాటు పనిచేశారు. రాజీవ్ గాంధీ హయాంలో యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా వ్యవహరించారు. ఆయన మృతితో అనసూయ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతితో అనసూయ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ తారలు, అనసూయ అభిమానులు సంతాపం వ్యక్తంచేశారు.