బుల్లితెరపై యాంకర్ గా అనసూయ భరద్వాజ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా.. సినిమాల్లో కూడా తన నటనతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ నటి అనేక సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ, సుకుమార్ సినిమాలో కీలక పాత్ర పోషించబోతుంది. సినిమా వాళ్లపై సహజంగానే సోషల్ మీడియాలో కొంతమంది పోకిరోళ్ళు కామెంట్స్ చేస్తుంటారు.
కానీ, ఇటీవల కాలంలో ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. అనసూయపై కూడా ఇలాంటి కామెంట్స్ ఎక్కువ కావడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో వేధింపులు జరుగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి కేసును పరిష్కరించేందుకు సిద్ధం అవుతున్నారు.