టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిగత విషయాలతో పాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని తెలుపుతుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె స్కూల్స్ పునః ప్రారంభం గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
ఆ ట్వీట్‌లో..‘డియర్ కేటీఆర్ సర్.. ఎందుకు లాక్‌డౌన్ చేశారో.. ఎందుకు తీసేశారో అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్లందరూ వ్యాక్సిన్ వేసుకున్నారని భరోసా ఇవ్వొచ్చు.. కానీ పిల్లల పిల్లల పరిస్థితి ఏంటి సర్?.. స్కూల్‌లో ఉన్నప్పుడు పిల్లలకు ఏమైనా జరిగితే వారు బాధ్యులు కారని సంతకం చేసిన పేపర్ పంపమని పాఠశాలలు ఎందుకు బలవంతం చేస్తున్నాయి.. చెప్పండి సర్.. ఇది ఎంతవరకు న్యాయం.. మీరు మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది.
Dear @KTRTRS Sir.. I want to understand why there was lockdown in the first place..and then there is unlock.. we can be a bit assured that we are all getting vaccinated..but what about the children below the required vaccine age sir?? Why are the schools forcing the parents (1/2)
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2021