HomeTelugu Trendingనోరు పారేసుకున్న నెటిజ‌న్.. అనసూయ స్ట్రాంగ్‌ కౌంటర్‌

నోరు పారేసుకున్న నెటిజ‌న్.. అనసూయ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Anasuya strong counter to n

బుల్లితెర‌ స్టార్‌ యాంకర్‌ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త‌న‌ నటనతో ఇటు టెలివిజ‌న్ పాటు వెండితెర‌పై త‌న దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ఇక సోషల్‌మీడియా ద్వారా అన‌సూయ అభిమానులతో టచ్‌ లో ఉంటుంది. కొంతమంది వీటిని ఎంజాయ్‌ చేస్తారు. మ‌రికొంద‌రు ట్రోల్ చేస్తుంటారు. తాజాగా అనసూయకు ఇటువంటి అనుభయమే ఎదురైంది.

తాజాగా ఓ వ్యక్తి మూడేళ్ల కింద‌టి నాటి ఫొటో షేర్ చేస్తూ అస‌భ్యప‌ద‌జాలంతో అన‌సూయ‌ను దూషించాడు. అంద‌రి అటెన్ష‌న్ కోసం ఇలా చేస్తుంద‌ని నెటిజ‌న్ ట్వీట్‌లో పేర్కొన‌గా,దీనిపై స్పందించింది అన‌సూయ‌. ఎపుడో మూడేళ్ల క్రితం జరిగిన ఈ వీడియో పట్టుకొని ఏదోదే మాట్లాడుతున్నావు. ఇద్దరు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత నాకు లో బీపీ వ‌చ్చింది. ఈ సంఘ‌ట‌న ఉద‌యం 5.30 గంట‌ల ప్రాంతంలో జ‌రిగింది. పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయ‌కు. 22 గంట‌లు నాన్‌స్టాప్‌గా ప‌ని చేయ‌డం వ‌ల‌నక‌ళ్లు తిరిగాయి త‌ప్ప నువ్వ‌న్న కార‌ణాలు కావు అంటూ నెటిజ‌న్‌కు స్ట్రాంగ్‌ రిప్లాయ్‌ ఇచ్చింది. పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో అనసూయకు సపోర్ట్‌ చేస్తున్నారు. మేడమ్‌ మీకు మేమున్నాం.. ఇలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటూ మద్దతుగా కామెంట్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu