అనసూయ బుల్లితెరపై యాంకర్‌గానే కాకుండా వెండితెరపై నటిగానూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తన సత్తా చాటుతోంది. వరుస ఆఫర్లతో జోరు మీదున్న అనసూయ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరుస్తోంది. గతంలో సాయిధరమ్‌తే్ నటించిన విన్నర్ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న `చావు కబురు చల్లగా` సినిమాలో అనసూయ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుంది. దీనికోసం అనసూయ రూ .20 లక్షలు డిమాండ్ చేశారట.. దానికి చిత్ర బృందం ఓకే చెప్పారట. ఈ స్పెషల్ సాంగ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. త్వరలోనే దీని షూటింగ్ హైదరాబాద్‌లో జరగనుంది. కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాత.