హాట్ యాంకర్ అనసూయ బుల్లితెరతో పాటు వెండితెర పై కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. టీవీ, సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అనసూయ తరచూ.. అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది. ఇక అనసూయ అలవాట్లు, అభిరుచులు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అయితే తాజాగా అనసూయ తన గ్లామర్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. “నేను రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్.. కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను. అవే నా గ్లామర్ సీక్రెట్ అని నేను అంటుంది.
నేను వైన్ తప్ప ఇంకేమి తీసుకోను. అది నా గ్లామర్ సీక్రెట్ కాబట్టి వైన్ మాత్రమే అలవాటు చేసుకున్నాను. వైన్ అనేది గుండెకు ఎంతో మంచిది. అందుకే రోజు ఒక గ్లాస్ అయినా తీసుకుంటాను. వైన్ ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఆకలిగా ఉంటే నిద్రపట్టదు. కాబట్టి గ్లాస్ రెడ్ వైన్ తాగుతాను. ఉపవాసాలు అంటారా.. అవంటే నాకు అసలు గిట్టదు. అందుకే ఫుల్ మీల్స్ బదులు గ్లాస్ రెడ్ వైన్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానంటుంది ఈ భామ. అందరి సంగతి పక్కన పెడితే నాకు మాత్రం వైన్ బాగా పనిచేస్తోందిని” అంటోంది.