యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతునే మరో వైపు మంచి అవకాశాలు వచ్చినప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పై మాట్లాడింది అనసూయ. తనకు వచ్చే జన్మంటూ ఉంటే ఏనుగులా పుట్టాలని ఉందని అంటుంది. అందుకు కారణం కూడా చెప్పుకొచ్చింది. ఏనుగుల గుంపులో ఆడఏనుగులకు ఎక్కువ గౌరవం దక్కుతుందని, ఏనుగుల జాతిలో వాటి జంట ఏనుగుల్లో ఒక ఏనుగు చనిపోతే మరో ఏనుగు నిద్ర హారాలు మానేసి చనిపోతుంది. అలాగే వాటి కుటుంబానికి ఆడ ఏనుగులు ప్రాతినిధ్యం వహిస్తాయి. అందుకే తనకు ఏనుగులా పుట్టాలని ఉందని చెప్పుకొచ్చింది అనసూయ.