బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. వెండీతెరపై కూడా తన సత్తా చాటుకుంటుంది. రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న అనసూయ.. ఆ తరువాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సినిమాలో ‘దాక్షాయని’ అనే కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంలో అనసూయ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.
మాస్ లుక్‌లో అనసూయ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ ప్రత్యేకంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్గా అలరించనుంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫష్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదల కానుంది.