సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో.. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల తేదీ, లోగోని విడుదల చేశారు. ఈ లోగోని ‘గుడుంబా శంకర్’ చిత్ర దర్శకుడు వీరశంకర్.. పాత్రికేయులు ప్రభు, వినాయకరావులు సంయుక్తంగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘మా చిత్ర విడుదలకు తేదీని, లోగోని విడుదల చేసిన దర్శకులు వీరశంకర్‌గారికి, మీడియా సోదరులు ప్రభు, వినాయకరావులకు మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి పెద్దలెందరో.. వారి సపోర్ట్‌ని అందించారు. వారందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నాము. అనసూయలోని మరో కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాము. అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..’ అని తెలిపారు.