అనసూయ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా బిజీగా ఉంటునే.. మరోపక్క వెండీతెరపై కూడా అదరగొడుతుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈమె మీద పాజిటివ్ ఇమేజ్ ఎంత ఉంటుందో.. అంతకు మించిన నెగటివ్ కామెంట్లు, ట్రోలింగ్ జరుగుతుంటుంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. దీంతో.. ఈ పోస్ట్ ఎందుకు పెట్టావు అంటూ.. ఏం జరిగింది? అంటూ నెటిజన్లు అడుగుతున్నారు. ఆ సుధీర్ఘమైన పోస్టును గమనిస్తే మాత్రం సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ చూసి బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
అందరికీ హలో.. అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను అంటూ నార్మల్‌గానే పోస్ట్ స్టార్ట్ చేసింది. ఈ ఏడుస్తున్న విజువల్స్ చూసి అంతా షాక్ అవుతారని అనసూయకు తెలుసు.. అందుకే ఈ పోస్ట్, ఆ వీడియో చూసి గందరగోళానికి గురి అవ్వొద్దని ముందే సూచించింది. ఇక ఆ తరువాత సోషల్ మీడియాను ఎందుకు వాడుతున్నాం.. మొదట్లో ఎలా వాడామో చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాను మొదట్లో సమాచారం కోసం, కమ్యూనికేషన్ వాడాం.. ప్రపంచంలోని జీవిన విధానాలు, పలు భిన్నమైన సంస్కృతి సంప్రదాయల గురించి తెలుసుకునేందుకు వాడాం.. నాలెడ్జ్ కోసం వాడేవాళ్లమంటూ ఇలా చెప్పుకుంటూ పోయింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాను దాని కోసమే వాడుతున్నామా? మన బాగు కోసం ఉపయోగించుకుంటున్నామా? అంటూ నిలదీసింది.
నేను ఈ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో షూట్లు, నవ్విన నవ్వులు.. వేసిన చిందులు.. వేసిన స్ట్రాంగ్ కౌంటర్లు.. నేను ఇచ్చిన కమ్ బ్యాక్‌లు.. ఇవన్నీ కూడా నా జీవితంలోని భాగాలే.. నేను బాగా లేని టైం.. కష్టాల్లో ఉన్న టైం.. ఇలా ఏడుస్తూ బ్రేక్ అయిన సందర్భాల గురించి ఎక్కువగా చెప్పుకోలేదు.. అని పోస్ట్ చేసింది.
https://www.instagram.com/reel/CwHqh09x9bQ/?utm_source=ig_web_copy_link