HomeTelugu Big Storiesహ్యాపి బర్త్‌డే అనసూయ

హ్యాపి బర్త్‌డే అనసూయ

Anasuya birthday special

బుల్లితెరపై యాంకర్‌ల్లోతనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది అనుసూయ. యాంకరింగ్‌ చేస్తూనే సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. నేడు(మే 15) అనసూయ పుట్టినరోజు. అనసూయ మే 15,1985లో పుట్టింది. ఆమె సొంతూరు నల్లగొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లి. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు. వాళ్ల అమ్మ ఆమెకు పవిత్ర అని పేరు పెట్టాలనుకుందట. కానీ వాళ్ల నాన్న మాత్రం వాళ్ల అమ్మ అనసూయ పేరునే తనకు పెట్టాడని సందర్భంలో అనసూయ చెప్పింది. అనసూయ ఎంబీఏలో హెచ్‌ఆర్‌ చేసింది. తొలుత ఓ బ్యాంకులో టెలీకాలర్‌గా పనిచేసింది. ఆమె తొలి జీతం రూ. 5వేలు మాత్రమే. ఆ తర్వాత ఒక విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే కొత్తమంది దర్శకులు ఆమెను చూసి సినిమా అవకాశాలు ఇచ్చారట. కానీ అనసూయ భయంతో వాటిని రిజెక్ట్‌ చేసిందట. నిశ్చితార్థం అయ్యాక కొన్ని కారణాల వల్ల హెచ్‌ఆర్‌ జాబ్‌ మానేసి ‘సాక్షి’లో న్యూస్‌ రీడర్‌గా చేరింది. కొన్నాళ్ల తర్వాత ఓ కామెడీ షోకి యాంకర్‌గా అవకాశం రావడంతో అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.

1

అనసూయది ప్రేమ వివాహం. ఆమె ఇంటర్‌లో ఉన్నప్పుడే సుశాంక్‌ భరద్వాజ్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబితే.. అనసూయ వాళ్ల నాన్న ఒప్పుకోలేదట. పైగా వేరే సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టారట. దీంతో అనసూయ తొమ్మిదేళ్ల పాటు ప్రేమ పోరాటం చేసి సుశాంక్‌కు వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ‘క్షణం’ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’లో నటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది. తాజాగా థాంక్యూ బ్రదర్ సినిమాతో ప్రేక్షలను పలకరించింది. ప్రస్తుతం ‘పుష్ప’, ‘ఖిలాడి’, ‘రంగమార్తాండ’ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మమ్ముట్టి నటిస్తున్న ఓ మలయాళం మూవీలో కీలకపాత్ర పోషిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu