కరోనా వైరస్ విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మన స్టార్స్ ఎవరికి తోచిన పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కొందరు గరిట పడుతుంటే, మరికొందరు భర్తలతో గిన్నెలు శుభ్రం చేయిస్తున్నారు. అయితే.. అనసూయ, రోజా, సుమ లాంటి వాళ్లు కూడా తాము సెలబ్రిటీస్ అనే విషయం మరిచిపోయి తల్లి అనే విషయం గుర్తు తెచ్చుకుని హాయిగా ఇంటి పనులతో బిజీ అయిపోయారు. ఇంట్లో పిల్లలు ఏది అడిగితే అది చేసి పెడుతున్నారు. మరికొందరు అయితే హాయిగా ఇంట్లోనే ఉండి డాన్సులు చేస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ రెండూ చేస్తుంది. ఇంటి పనులు చేస్తూనే డాన్సులు కూడా చేస్తుంది.
ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అంటూ పాట పాడుతుందీ భామ. అంట్లు తోముకుంటూ కూడా అదిరిపోయే డాన్సులు చేస్తోంది. దానికితోడు చిన్న షార్ట్స్ వేసుకుని పిచ్చెక్కిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్లో బాగా వైరల్ అవుతోంది. అనసూయ కొడుకు ఈ వీడియోను తీస్తున్నాడు. దాంతో పాటు అను ఇల్లు కూడా బాగానే ఫోకస్ చేసాడు బుడ్డోడు. అనసూయ డాన్సులు చేస్తూ గిన్నెలు శుభ్రం చేస్తుంటే ఆమె భర్త భరద్వాజ్ ఇల్లు క్లీన్ చేస్తూ సాయం చేస్తున్నాడు. మొత్తానికి ఈ లాక్డౌన్ సమయంలో అందరూ ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేస్తున్నారు మన స్టార్స్. ఇది ఏమైనా ఈ కరోనా కొందరికి మేలు చేసిందనే చెప్పాలి. ఎప్పుడూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే సెలబ్రిటీలను సైతం ఇళ్లకే పరిమితం చేసింది.